ఏమో! కొన్నిసార్లు మనసెందుకు జ్ఞాపకాలను తడుముతుందో! ఎందుకు రెప్పల దుప్పటిని నిర్దాక్షిణ్యంగా రాత్రంగా దూరంగా నెడుతుందో! ఏమో! ఎందుకో! … ఎందుకు సద్దుమణిగిన శ్వాసను పరుగులు పెట్టిస్తుందో! సమస్తమనుకున్నదాన్నంతా…..సమస్తం కాదని ఎత్తిపొడుస్తుందెందుకో! ఏమో! ఎందుకో! కాలమనే గొప్ప ఔషధాన్ని పూసి….మాన్పేసాననుకునే గాయాలను తిరిగి పచ్చిగా చేసి పోతుందెందుకో! చిగురించిన వసంతం వెనుకనున్న శిశిరాన్ని…..పూడ్చేసిన వెర్రి మోడులను చూపెట్టి భయపెడుతుందెందుకో! ఏమో! కొన్నిసార్లు మనసెందుకు తాను పిచ్చిదాన్నని నిరూపించుకోవాలనుకుంటుందో! ఏమో! ఎందుకో!