Latest Entries »


Sky still hovers my veils…
See what life explores!
Genesis of serendipity…
A new tabernacle of angels showers…
Miracles do happen…
As I always, say!


క్రికెట్ మ్యాచ్ అంటే చాలు…డాడీకి మహా ఇష్టం. ఒక్కోసారి ఆఫీసుకి సెలవు పెట్టి మరీ చూసేవారు. మేము కూడా స్కూలు ఎగ్గొట్టేసి డాడీతో ఎంజాయ్ చేసే వాళ్ళం. వరల్డ్ కప్ ఐతే మరీనూ! అప్పుడు చెల్లి, తమ్ముడు చిన్నోళ్ళు. అయినా ఓ కేరింతలు కొట్టేవాళ్ళు. మమ్మీ కూడా అప్పుడప్పుడూ (మేం ఫోర్ అనో, సిక్స్ అనో అరచినపుడు) వచ్చి ఒక నవ్వు నవ్వి వెళ్ళిపోయేది. నాకు కాస్త ఊహ వచ్చాకే, వరల్డ్ కప్ మ్యాచ్ జరుగుతోంది. సౌత్ ఆఫ్రికాకి, ఇండియాకి మధ్య. డాడీ సౌత్ ఆఫ్రికా ఆటగాడు సిక్స్ కొట్టినా, బాగా క్యాచ్ పట్టినా, మంచి ఫీల్డింగ్ టాలెంట్ చూపించినా చప్పట్లు కొడుతున్నారు. వెరీ గుడ్ అంటున్నారు. మర్నాడు పాకిస్తాన్, ఇండియా మ్యాచ్. చిన్నవాళ్ళమైనా, అదేమిటో…ఈ రెండు దేశాల మధ్యా మ్యాచ్ కూడా యుద్ధమేనని మా భావన. ఆ రోజు నాకు తిక్క పుట్టుకొచ్చింది. పాకిస్తాన్ ఆటగాళ్ళ తీరును అన్ని దేశాల వాళ్ళను మెచ్చుకొన్నట్లే మెచ్చుకొంటున్నారు. ఈ చీరప్ కార్యక్రమం నాకు నచ్చలేదు. కొంత సేపు భరించాను. ఇక నా వల్ల కాలేదు. “వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు కదా! నువ్వెందుకు అలా వాళ్ళను మెచ్చుకుంటున్నావ్?” అని అడిగేసాను. (వాళ్ళు మన శత్రువులు కదా అనే నా భావన) డాడీ పెద్దపెట్టున నవ్వారు (అలాగే నవ్వేవారు) పాకిస్తానా? ఇండియానా? ఇంక వేరే దేశమేదైనానా అనేది కాదు ముఖ్యం….వారి టాలెంట్ ముఖ్యం….ఆ ఆటగాడి నైపుణ్యాన్ని, కౌశలాన్ని మెచ్చుకోలేకుండా నిన్ను ప్రభావితం చేయడం అతని గొప్పతనమైతే….దేశం, ప్రాంతం అనే భావన లేకుండా ఒకరి ఆటను మెచ్చుకోవడం అసలైన స్పోర్టివ్నెస్” అన్నారు. అదే విత్తనమైంది నాలో! నేను పెరిగేకొద్దీ ఆ భావం ఇంకా బలపడింది. మానవులమన్న భావన ఎంత గొప్పదో తెలిసొచ్చింది. నేడున్న పరిస్థితుల్లో ఈ భావన ఎంత ఉపయోగపడుతుందో తెలుస్తుంది.


భూతద్దాలు ప్రతి ఒక్కరి దగ్గరా ఉంటాయి….
అనవసరంగా బయటికి తీసి మండే ఎండలో పెడితే,
భూతద్దం క్రింద,
మట్టిని పట్టుకుని ఉన్న తెల్లకాగితాలు మాడి మసైపోతాయి!!!


వ్యక్తి పూజ మానలేకపోతే నేటి కన్నా దుర్భర పరిస్థితులు ఎదుర్కోవలసి వస్తుంది భవిష్యత్తులో! కుటుంబ భజన వదలకపోతే చేతులు ఎలాగూ కాలిపోయాయి….వళ్ళు మొత్తం కాలిపోయే ప్రమాదాలు పొంచి ఉన్నాయి!


మొన్న హైదరాబాదు సభ సమయంలో అది జరిగింది, ఇది జరిగింది అని రెండు ప్రక్కల వాళ్ళూ ఏవేవో పోస్టులు పెట్టేసేవారు. నాకు చాలా ఇష్టమైన వ్యక్తులు, నా అత్యంత ఆప్త మిత్రులు తెలంగాణా ప్రాంతంలోనే ఎక్కువ ఉన్నారు. అందులో ఒక అబ్బాయి మీడియాకు చెందినవాడు. మొన్నటి ఫేస్ బుక్ అప్డేట్స్ లో ఈ అబ్బాయిని కొట్టేసారనీ, అలా కొట్టిన వారిని ఊరికే వదలొద్దనీ ఒక అప్డేట్ చూసాను. మ్రాన్పడిపోయాను. ఆ అబ్బాయి వ్యక్తిత్వం అంటే ఇష్టం, అతను రాసే కవిత్వమంటే మరీ ఇష్టం. కొట్టి ఉంటారు అనుకుని, ఇటు నుండి వెళ్ళిన వాళ్ళను తిట్టుకున్నాను. ఫోన్ చేద్దామనుకున్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నాడో ఒక రోజు ఆగి చేద్దాం అని ఆగాను. రాత్రి ఆ అబ్బాయి ఆన్లైన్ కనిపించాడు. ప్రాణం లేచొచ్చినట్లయింది. “నువ్వు బాగానే ఉన్నావా?” అని పింగ్ చేసా! “బానే ఉన్నా! ఎందుకలా అడిగారు?” అన్నాడు. విషయం చెప్పాను. “అదంతా అవాస్తవం మేడం” అన్నాడు. హమ్మయ్య అనుకున్నా! ఇంతకీ ఇటువంటి అప్డేట్ పెట్టిన సదరు వ్యక్తి ప్రొఫైల్ ని వెంటనే విజిట్ చేసి చూద్దును కదా! ఆ రోజు పోస్ట్ చేసిన రెచ్చగొట్టదగు పోస్ట్ లు చాలా వరకూ తీసివేయబడ్డాయి! వార్నీ! అనుకున్నా!
సభలన్నాక కొన్ని గొడవలు జరుగుతాయి. దుష్టశక్తులు (రెండు వైపులా) తమ వీరంగాన్ని చూపించే ప్రయత్నమూ చేస్తాయి. కానీ ఇటువంటి పోస్టులను పెట్టే ముందు ఒకసారి ఆలోచించాల్సిన అవసరం లేదా? అటువంటి అప్డేట్స్ నిజమనుకుని గొడవలు ఇంకా పెరిగితే ఈ పోస్టులు పెట్టిన వాళ్ళు బాధ్యత వహిస్తారా? ఎవరిదైనా ప్రాణమే! మిత్రులందరికీ నా మనవి ఏమిటంటే, దయచేసి రెచ్చగొట్టే పోస్టులు ( మీకు తెలియని విషయాలైతే మరీను) పెట్టకండి. మనం పెట్టిన అప్డేట్స్ డిలీట్ చేసే అవకాశం ఫేస్ బుక్ లో ఉంది కానీ ఆ అప్డేట్స్ పర్యవసానంగా ఎటువంటి హింస జరిగినా దాన్ని డిలీట్ చేసే అవకాశం లేదు కదా!!

మత మార్పిడిjajjl
నా మతం వేరు
అంతర్లీనంగా నా భావాలు రత్నగిరి పుష్పాలు
నా నమ్మకాలు దేవగిరి రత్నాలు
నా అభిప్రాయాలూ…
నా వేషభాషలూ….
నా అనేవన్నీ నా అంతర్మతానికి ప్రతీకలు
నా వంటరి జీవనంలో
నా మతం వేరు….మానవత్వం!

సమూహానికొచ్చేసరికి
అన్నీ మారిపోతున్నాయి….
వద్దనుకున్న వాటన్నింటికీ ఔనంటున్నాను
లేనివాటన్నింటినీ ఉన్నాయంటున్నాను
గొర్రెలా….
ఏమీ తెలియని మనిషిలా
సమూహపు గొంతులో గొంతు కలుపుతున్నాను
నరాల్లోకి ఎక్కనని మొండికేస్తున్నా….
విషాన్ని బలవంతంగా ఎక్కిస్తున్నాను
ఈ మత మార్పిడి వద్దని మనసు మొరాయిస్తున్నా….
శిరసు వంచి స్వీకరిస్తున్నాను!

అమృతం పంచిన చేతులనుండి విషం రాలుతుంటే…
మనసంతా చేదైపోతున్నా….
చుట్టూ ఉన్న చేతులు జై కొడుతుంటే…
చేదుకు “జీర్ణం, జీర్ణం వాతాపి జీర్ణమని” పాట పాడుతున్నాను
ఒక్కోసారి నిద్రలో మౌనవిగ్రహం నడిచొస్తుంది
“నీకన్నా నేనే నయం పో” అంటూ ఈసడిస్తుంది
నియంత్రణకు బానిసైపోయావంటూ వెన్ను వెక్కిరిస్తుంది
ఏం లాభం?
మానవత్వపు మతం ఎంత ఉన్నతం…
ఇపుడు మారిన విద్వేషపు మతం మహా పాషాణం

విరగ్గాసిన ప్రజాస్వామ్యపు పూదోటను
నిస్సిగ్గుగా నేనే మంట పెట్టేస్తాను
గోడకు మొలిచిన అడవి గడ్డిలా గోడను లోపల్నుండి చీల్చేస్తాను
శిధిలమయ్యేది నేనే!
తెలిసినా, తెలియనట్లు నటించేస్తూ ఉంటాను
భజనల్లో భేష్ భేష్ అనిపించుకుని భుజకీర్తులు పెంచుకునీ
లోపలి శూన్యాన్ని తేలిగ్గానే మోసేస్తాను
పైకెంత బింకంగా ప్రగల్భాలకు పోయినా….
కటిక పేదగా…
విశాలమైన ప్రపంచవేదికపై చివరికి మిగిలిపోతాను!
దుర్భరమైన ద్వేషపు మత మార్పిడికి ఒక చిహ్నంగా మిగిలిపోతాను!

I am adamant


 

5421927570_23044dc641_z

I am adamant

There is always a second fiddle in my hand

I am defiant

There is always the eighth colour in my spectrum

When the pattern chips away

One last thing I can do is to build another

When the story starts ending

One best thing I can do is start another!

A contour’s curvature


1234834_10202047187565407_921010029_nA contour’s curvature is your shoulder
When I wish to put the deadly weight of my head on…..
It beheads the earthquakes breaking inside me…
It diverts the floods flowing through me!

Cradling me in the arms
You make me a small baby
Softening my roughened lines
You spread a mattress of comfort

A spirited light is your word
When I babble a lot
It cuts off the bewilderment roaming in me
It gently touches the coarseness in me!

Etching your love on my living
You define our being together
Laminating the halo around us
You build an angels tabernacle

A vaulted pearl is your embrace
When I feel insecure
It caresses the divinity in me
It removes all the chimed smokes from me!


sometimes I become a flint stone….
both external as well as internal….
don’t dare to rub and ignite…
brewing silence may explode!fq5029d9bf


చిన్న చిన్న వాక్యాల మధ్య…

రాయలేని ప్రబంధాలను చదవమంటావ్

రెండు సాగరాల నడుమ నిలిచిన…

పర్వతాలను అధిరోహించమంటావ్

అవనికీ ఆకాశానికీ నిట్టనిలువుగా….

గీతలో ప్రయాణించమంటావ్

మన స్వరాలకావల పలకలేని రాగాలన్నింటినీ….

కన్నీటిపొరల నుండి విడిపించమంటావ్

ఏదని చేయగలను?

అలికేసిన అలజడుల ప్రాయంలో

అలసిన దేహపు ఆత్మావలోకనంలో

పరుగులు పెట్టిస్తావ్

నన్ను నేనే మరచిపోయే ప్రక్రియలో ఉంటే…

నిన్ను నాలోకి నెట్టేస్తావ్

నేననే పదార్థాన్నే విస్మరించేస్తుంటే…

నేనున్నానంటూ తిరోగమన రూపవిక్రియకు శ్రీకారం చుడ్తావ్!!